సినిమా లవర్స్ కు ఒక గుడ్ న్యూస్. ఇక ప్రేమ పక్షులకైతే పండగ లాంటి వార్త. మే 1న ఓ సూపర్ లవ్ మూవీ రీరిలీజ్ కాబోతోంది. పైగా అలాంటి ఇలాంటి చిన్న సినిమా కాదు. నిజమైన ప్రేమకి సరికొత్త అర్థాన్ని చెప్పిన లవ్ సినిమా ‘ప్రేమికుడు’. 1994లో హీరో ప్రభుదేవా, హీరోయిన్ గా నగ్మా నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.
Also Read: Indravelli: ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు ఆదివాసీలు
ఇకపోతే మే 1న ఈ సంచలన ప్రేమ చిత్రం రీరిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఏకంగా 300 స్క్రీన్సులో సినిమా రీరిలీజ్ అవుతుందంటే ఈ సినిమా స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోని గొప్పగా పేరుందిన డైరెక్టర్ లలో ఒకరైన శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పటికి తెలుగు వారి నోట పడుతూనే ఉంటాయి. సినిమాలోని ముక్కాల పాటకి పాటకైతే సీట్స్ లో కూర్చోకుండా లేచి మరి డాన్స్ వేసే విధంగా ప్రభుదేవా డాన్స్ ను చేసి చూపించాడు. గ్రాఫిక్స్ ఎక్కువగా వాడని ఆ రోజుల్లోనే ఈ పాటని అత్యంత అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకుల్ని మైమరిపించారు.
Also Read: Salman Khan : సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటన కేసు.. మరొకరు అరెస్ట్
దివంగత గాయకులు బాలసుబ్రమణ్యం సినిమాలో హీరో ప్రభుదేవాకి తండ్రిగా నటించి మెప్పించారు. ఒక పేదవాడు గొప్పింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే కాన్సెప్ట్ మీదుగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు కేటికంజు మోహన్ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో ప్రేమికుడు పేరుతో విడుదల అవ్వగా.. తమిళంలో కాదలం అనే పేరుతో సినిమా రిలీజ్ అయింది. ఆ సమయంలో కుర్రకాలని ఈ ప్రేమికుల కథ ఇప్పటివరకు కూడా ఆ క్రేజ్ ను అలాగే కొనసాగిస్తుంది. మరి మీలో ఎవరు ఈ సినిమా రీరిలీజ్ రోజు సినిమా చూడ్డానికి వెళ్తున్నారు.