పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ T64 ఫైనల్‌లో భారత పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశానికి స్వర్ణ పతకాన్ని అందించాడు. పొట్టి కాళ్లతో జన్మించిన ప్రవీణ్.. పతక రౌండ్‌లో 2.08 మీటర్లు ఎగసి రికార్డు బద్దలు కొట్టాడు. ఈ జంప్‌తో అతను సరికొత్త రికార్డును నెలకొల్పాడు.రెండవ, మూడవ స్థానాల్లో USA డెరెక్ లోసిడెంట్ (2.06 m), ఉజ్బెకిస్తాన్ టెముర్బెక్ గియాజోవ్ (2.03 m) ఉన్నారు.
Read Also: Lavanya : రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి పారిపోయాడు.. శేఖర్ బాషాతో అదే గొడవ!
ఈ పతకంతో ప్రస్తుతం జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు ఆరు బంగారు పతకాలు, తొమ్మిది రజత పతకాలు, 11 కాంస్య పతకాలతో భారత్ పతకాల సంఖ్య 26కు చేరింది. కాగా.. టోక్యో 2020లో మొత్తం ఐదు స్వర్ణాలను సాధించగా.. పారాలింపిక్స్ గేమ్స్ ఈవెంట్‌లో ఇండియా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది.
Read Also: TPCC Chief : టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 21 ఏళ్ల ప్రవీణ్ మరియప్పన్.. తంగవేలు తర్వాత పారాలింపిక్స్‌లో పురుషుల హైజంప్‌లో బంగారు పతకం సాధించిన రెండవ భారత పారా అథ్లెట్ గా నిలిచాడు. ఈ విజయంతో ప్రవీణ్ కుమార్ పారిస్‌లో పతకం సాధించిన మూడో భారతీయ హైజంపర్‌గా నిలిచాడు. ప్రవీణ్ కంటే ముందు.. శరద్ కుమార్ రజత పతకాన్ని గెలుచుకోగా, మరియప్పన్ పురుషుల T63 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.