Lavanya Says Raj Tarun Escaping From Her: కేసు ఛార్జ్ షీట్ లావణ్యకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఆమె ఎన్టీవీతో మాట్లాడింది. అసలు శేఖర్ భాషాతో మీకు ఉన్న గొడవ ఏంటి అతను మీడియా ముందుకు వచ్చి లావణ్యకు చాలా మంది అబ్బాయిలతో అఫైర్ ఉందని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే శేఖర్ బాషాను మీరు చెప్పుతో కొట్టేదాకా కూడా పరిస్థితి వచ్చింది. అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవ? అని అడిగితే అతను మగజాతి ఆణిముత్యాన్ని అని చెప్పుకుంటున్నాడు. అలా అయితే మగజాతి ఆణిముత్యాల కోసం ఫైట్ చేయాలి కదా. శేఖర్ బాషా నాతో సంసారం చేసిన మగాడిలాగా మూడు సంవత్సరాలు ఉన్నాడు, రెండు సంవత్సరాలు ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. మరి పోలీసులు చెప్పారు కదా చార్జ్ షీట్ వేశారు.
Lavanya : కలిసి వినాయక చవితి చేసుకునేవాళ్ళం.. నా రాజ్ కోసమే ఈ పోరాటం!
నేను చెప్పినప్పుడు పదేళ్లు పైగా కాపురం చేసాం అని చెబితే ఎవరైనా నా మాట విన్నారా? అతను సొంత మైలేజ్ కోసం బిగ్ బాస్ కి వెళ్లడం కోసం చేసిన డ్రామా ఇదంతా.. అతనికి పెళ్లయింది, ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. నేను అతనికి ఆడదానిలా కనిపించలేదా? అతనికి నేను ఒక మనిషిలా కూడా కనిపించలేదా? అతను సొంతదారులు చూసుకుని వెళుతున్నప్పుడు కళ్ళతో చూసినట్టు మాట్లాడేసాడు. శేఖర్ బాషా మీరు మాట్లాడుతున్నది తప్పు, మీరు ఎందుకు జడ్జి చేస్తున్నారు అని నేను ఫోన్ చేసి మాట్లాడిన రోజున నువ్వు ఆ ఇల్లు ఖాళీ చేసేయ్ అంటాడు. నేను 11 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న ఇల్లు అది. ఆ ఇల్లు నాది, అని ఆమె అన్నారు. రాజ్ తరుణ్ కూడా ఆ ఇల్లు నాదే అంటున్నారు గతంలో పలు సందర్భాల్లో చెప్పారు కదా అని అంటే నేను జైలు నుంచి వచ్చిన తర్వాత రెండో రోజు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి రాజ్ తరుణ్ పారిపోయాడు.
వెతుకుతున్నది నేను పారిపోతున్నది రాజ్ తరుణ్. అతని మూవీ ప్రెస్ మీట్ అప్పుడు కూడా నేను అతని చూడ్డానికి వెళ్లాను ఇంత లాంగ్ గ్యాప్ తో మేము ఎప్పుడూ కలుసుకోకుండా లేము.. మస్తాన్ సాయి, లావణ్య ఇంట్లో కలిసి ఉంటున్నారు కలిసి ఉండటమే కాదు డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారని రాజ్ తరుణ్ అన్నాడు కదా అని అడిగితే అది పిచ్చి అబద్ధమని లావణ్య తెలిసింది. ఈ కేసులో ఎలా అయితే ఛార్జ్ షీట్ నాకు అనుకూలంగా వచ్చిందో డ్రగ్స్ కేసులో కూడా నేను తప్పు చేయలేదని బయటకు వస్తాను. కచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి. కోర్టు లా అండ్ ఆర్డర్ మన చేతిలో పని కాదు. కానీ నేను పోరాడుతాను నిరూపించుకుంటాను, అప్పటి వరకైనా టైం ఇవ్వండి అని లావణ్య అన్నారు.