Is Chiranjeevi Chief Guest for Hanuman Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘హనుమాన్’. సోషియోఫాంటసీ కథాంశంతో సూపర్ హీరో చిత్రంగా దీనిని తెరకెక్కించారు. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాత కాగా.. అమృతా అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హనుమాన్ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా 11 భాషల్లో విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది.
తాజాగా హనుమాన్ సినిమా నుంచి ‘శ్రీరామ దూత స్తోత్రం’ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. హనుమాన్ మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్‌ను జనవరి 7 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారని సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో చిరు వస్తున్నారని చెప్పకపోయినా.. మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్ అని హింట్ ఇచ్చారు. దాంతో చిరునే చీఫ్ గెస్ట్ అని ఫాన్స్ అంటున్నారు.
Also Read: Sandeep Reddy Vanga: ఆ ఇద్దరు స్టార్‌లతో సినిమాలు చేస్తా!
హనుమాన్ సినిమాపై సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భాగం కాబోతున్నారట. హనుమాన్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ చిత్రంపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం ఫ్యామిలీ అడియన్స్ సహా యూత్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
His highness should be celebrated in a grand and splendid way ❤️🔥
Celebrating #HANUMAN, Mega Pre-Release Utsav on JANUARY 7th, Sunday 🎪
📍N Convention, HYD
⌛6PM OnwardsA @PrasanthVarma Film
🌟ing @tejasajja123In WW Cinemas from JAN 12, 2024!#HanuManOnJAN12th@Niran_Reddy… pic.twitter.com/QBYkaXOq8u
— Primeshow Entertainment (@Primeshowtweets) January 3, 2024