Ghaati : అనుష్క శెట్టి ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె ఒకప్పుడు గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తుంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రం ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్కకు ఇది నాలుగో సినిమా. అనుష్క పుట్టినరోజును సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో అనుష్క పాత్ర స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. పోస్టర్‌లో, అనుష్క తల, చేతుల నుండి రక్తం కారుతున్నట్లు కనిపిస్తుంది, ఆమె నుదిటిపై బిందీతో, బంగా స్మోక్ చేస్తూ కనిపించడం స్టన్నింగ్ గా అనిపించింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Read Also:Crime: డబ్బు కోసం స్నేహితులతో భార్యపై అత్యాచారం.. మూడేళ్లుగా నరకం..
ఇప్పటికే 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్ రెడీ స్టార్ట్ అయింది. ఇక వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు డైరెక్టర్ క్రిష్. ఈ క్లైమాక్స్ షూట్ పూర్తి అయిన తర్వాత అనుష్క తన పాత్రకు డబ్బింగ్ ను కూడా పూర్తి చేయనున్నారట. ఈ క్లైమాక్స్ షూట్ ను జనవరి చివరలో తీసే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తో అంచనాలు పెంచేశారు. అనుష్క లోని మాస్ యాంగిల్ ని మరోసారి ఆవిష్కరించనున్నారు. అనుష్క చేసిన అరుంధతి, రుద్రమదేవి సినిమాల మాదిరి అనుష్కకు క్రేజ్ తెచ్చేలా ఈ సినిమా ఉందని చెబుతున్నారు. ఘాటి సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ లాక్ చేశారు. అసలైతే ఆ టైం లో ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ అనుకున్నారు కానీ ఆ సినిమా వాయిదా పడుతుందని తెలిసి ఘాటిని వదులుతున్నారు.
Read Also:Onion Juice: ఈ రసం ఒక గ్లాస్ తాగితే చాలు నిమిషాల్లో కడుపు నొప్పి మాయం
యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రభాస్ దగ్గర వాళ్లది కావడంతో ఘాటి సినిమా ప్రమోషన్స్ కి ప్రభాస్ వస్తారని తెలుస్తోంది. అలాగే అనుష్క, ప్రభాస్ మధ్య కూడా మంచి స్నేహ బంధం ఉంది. అనుష్క కోసం ప్రభాస్ ని అడిగితే తప్పకుండా వస్తాడు. యువి బ్యానర్ ప్రభాస్ సొంత సంస్థ అన్నట్టే. అందుకే అనుష్క ఘాటి ప్రమోషన్స్ కి ప్రభాస్ కూడా తన సపోర్ట్ అదించడానికి రెడీ అన్నట్టు సమాచారం. ఘాటి సినిమాను కేవలం తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.