టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నాకు.. ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు. పుష్కరకాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా.. టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్సులు రావట్లేదు. తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడీ కట్టిన దాఖలాలేవు. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని స్లిమ్ అయినా కూడా రాశీని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిలైంది టాలీవుడ్. రాశీ ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా.. ఇతర హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నదే ఎక్కువ. టాలీవుడ్డే కాదు.. కోలీవుడ్ లోనూ ఆమెది ఇదే పరిస్థితి.
Also Read : K RAMP : కిరణ్ అబ్బవరం ర్యాంప్.. జస్ట్ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్
పక్కా కమర్షియల్, థాంక్యూ ప్లాప్స్ తర్వాత టాలీవుడ్ కు దూరమైన రాసి.. రెండేళ్ల తర్వాత తెలుసు కదాతో ప్రేక్షకుల ముందు వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి లతో స్క్రీన్ షేర్ చేసుకున్న తెలుసు కదా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలయింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది రాసి. ప్రమోషన్స్ ఈవెంట్స్ లో పాల్గొని ఈ సినిమాను మరింత ప్రమోట్ చేసింది. కానీ రాశి పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. తెలుసుకదా తొలి ఆటనుండే ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుని బిలో యావరేజ్ కలెక్షన్స్ రాబట్టింది. థియేట్రికల్ రన్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. తెలుసు కదాతో రాశి ఖన్నా ఖాతాలో మరో ప్లాప్ వచ్చి చేరింది. ఇక తెలుగులో రాశి ఖన్నాకు ఉన్న ఒకే ఒక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఒక్కటే రాసి చేతిలో ఉంది.