Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ryan ten Doeschate appointed Head of Cricket Strategy at KKR: టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి వీడ్కోలు పలికిన మరుసటి రోజే ర్యాన్ టెన్ డస్కాటెకు కొత్త బాధ్యతలు దక్కాయి. భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో తన ప్రయాణాన్ని ముగించిన డస్కాటె.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీలో చేరాడు. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. డస్కాటెకు హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా నియమిస్తూ.. నైట్ రైడర్స్ గ్లోబల్ క్రికెట్ వ్యవస్థలో కీలక బాధ్యతలు అప్పగించింది.
ర్యాన్ టెన్ డస్కాటె ఇకపై ఆటగాళ్ల అన్వేషణ (స్కౌటింగ్), కొత్త ఆటగాళ్ల ఎంపిక, జట్టు ప్రణాళిక, ప్రతిభాభివృద్ధి, ప్రదర్శన విశ్లేషణ వంటి కీలక అంశాలను పర్యవేక్షించనున్నాడు అని కేకేఆర్ తెలిపింది. అలాగే నైట్ రైడర్స్‌కు చెందిన అన్ని గ్లోబల్ ఫ్రాంచైజీల కోచింగ్ బృందాలతో కలిసి పనిచేయనున్నాడు. అదనంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, ఐఎల్టీ20లో అబుదాబి నైట్ రైడర్స్, మేజర్ లీగ్ క్రికెట్లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ జట్లకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా సేవలందించనున్నాడు.
Also Read
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
ర్యాన్ టెన్ డస్కాటె నియామకంపై నైట్ రైడర్స్ స్పోర్ట్స్ సీఈఓ వెంకీ మైసూర్ ఆనందం వ్యక్తం చేశారు. ‘టెండోను మళ్లీ నైట్ రైడర్స్ ఫ్యామిలీలోకి స్వాగతించడం ఎంతో సంతోషంగా ఉంది. మా క్రికెట్ ఫిలాసఫీ, వ్యవస్థపై అతడికి పూర్తి అవగాహన ఉంది. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్లో అతడికి ఎంతో అనుభవం ఉంది. అందుకే ఈ బాధ్యతలు అప్పగించాం. నైట్ రైడర్స్ గ్లోబల్ వ్యవస్థ అభివృద్ధిలో డస్కాటె కీలక పాత్ర పోషిస్తాడని విశ్వసిస్తున్నాం’ అని పేర్కొన్నారు. మరోవైపు ర్యాన్ టెన్ డస్కాటె కూడా తన పునరాగమనంపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘మళ్లీ నైట్ రైడర్స్ కుటుంబంలో చేరడం చాలా ఆనందంగా ఉంది. మా గ్లోబల్ ఫ్రాంచైజీల కోచింగ్, అనలిటిక్స్ బృందాలతో కలిసి స్కౌటింగ్, ప్లేయర్ డెవలప్మెంట్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, దీర్ఘకాలిక క్రికెట్ వ్యూహాన్ని రూపొందించడం నా ప్రధాన లక్ష్యం’ అని తెలిపాడు.
ర్యాన్ టెన్ డస్కాటెకు నైట్ రైడర్స్ ఫ్రాంచైజీతో దశాబ్దానికి పైగా అనుబంధం ఉంది. 2011లో కేకేఆర్ తరఫున ఆటగాడిగా చేరిన అతడు.. 2012, 2014లో ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అనంతరం 2022లో కోచింగ్ బృందంలో చేరి.. 2024లో కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సీజన్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు కొత్త బాధ్యతలతో మరోసారి నైట్ రైడర్స్ గ్లోబల్ క్రికెట్ వ్యవస్థలో తన ముద్ర వేయడానికి సిద్ధమయ్యాడు.
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!