అన్ని కేసుల్లో బెయిల్స్ పోసాని కృష్ణ మురళికి సంబంధిత న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చాయి. నిన్న నర్సారావుపేట కోర్టు, ఇవాళ ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్స్ మంజూరు చేశాయి. అంతకుముందే రాజంపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానిపై మొత్తంగా 17 కేసులు నమోదయ్యాయి. మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.