Chef Mantra Project K: ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమైపోయిన సుమ కుకింగ్ షో..
- ఆహా ఓటీటీలో మరో ఎగ్జైటింగ్ కార్యక్రమం
- "చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K" పేరుతో సెలెబ్రెటీస్ తో వంటకాల కార్యక్రమం.
- హోస్ట్ గా సుమ కనకాల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chef Mantra Project K: ఆహా ఓటీటీ మరోసారి ఓ ఎగ్జైటింగ్ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మార్చి 6వ తేదీ నుంచి ‘సుమ కనకాల’ హోస్ట్ గా చేయబోతున్న ఈ “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K” ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కు కానున్నది. చెఫ్ మంత్ర 3 సీజన్లు 1 టేస్టీ ఎంటర్టైన్మెంట్ ను ఈ సీజన్ 4లో మరింతగా అందించనుంది. ప్రాజెక్ట్ K అంటే ఏంటి? అనేది ప్రేక్షకుల్లో ఇప్పుడు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. యాంకర్ సుమతో పాటు నటుడు జీవన్ కుమార్ కూడా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ Kలో తనవంతు వినోదాన్ని అందిచనున్నారు.
Read Also: Trinadha Rao: మజాకా డైరెక్టర్ ను లైన్ లో పెట్టిన యంగ్ హీరో..?
Also Read
ఈ షోలో అమర్ దీప్ – అర్జున్, దీపికా రంగరాజు – సమీరా భరద్వాజ్, సుప్రిత – యాదమ్మ రాజు, ప్రషు – ధరణి, విష్ణుప్రియా – పృథ్వీ జోడీలతో రుచికరమైన వంటకాలు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. తెలుగింటి వంటలు మాతరమే కాకుండా.. సప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు ప్రతి ఎపిసోడ్ లో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K అందించనుంది. ఈ సీజన్ ప్రోమో ఇప్పటికే రిలీజై సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ.. ఆహా ఐదేళ్ల వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో 2025 మాకు ఎంతో ప్రత్యేకమైనదని.. అలాగే ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K సీజన్ 4 ఆ ప్రయత్నంలో భాగమే. 10 మంది కంటెస్టెంట్స్ పరిచయం చేసే వంటకాలు, నవ్వించే సుమ హోస్టింగ్, జీవన్ కుమార్ ఫన్ ప్రేక్షకులకు రుచికరమైన వంటలతో పాటు కావాల్సినంత వినోదాన్ని అందించబోతున్నాయన్నారు. చూడాలి మరి సెలెబ్రెటీస్ చేసే ఈ వంటకాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించగలదో.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు