NTV Telugu Site icon

Ponnam Prabhakar : నేతన్నలు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం మీకు అండగా‌ ఉంటుంది

Ponnam Prabhakar 12

Ponnam Prabhakar 12

Ponnam Prabhakar : కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, కేటీఆర్ సిరిసిల్ల నేతన్న ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయనను రాజీనామా చేయాలని మేము కోరలేదని, సిరిసిల్లలో దంపతుల అత్మహత్యకి భీమండిలో చేసిన అప్పులతో పాటు ఇల్లు కట్టుకోవడం వల్ల జరిగిన అప్పులు కారణమని మా దృష్టికి వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. నేతన్నలు అధైర్యపడవద్దు, ప్రభుత్వం మీకు అండగా‌ ఉంటుందని, కేటీఆర్ ఎమ్మెల్యే గా, నేను‌ఎంపిగా ఉన్న సమయంలో చేనేత‌ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసామన్నారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేయడం బాధకరమని, కావాలని కలెక్టర్ ని తప్పుత్రోవ పట్టించి దాడి చేసారన్నారు. కలెక్టర్ పై దాడి చేయ్యడం ‌ప్రజాస్వామ్యామా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్దతిలో, న్యాయవ్యవస్థ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని, బీఆర్ఎస్ ‌నాయకులు‌‌ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించునట్లు‌ ఉందని ఆయన విమర్శించారు. సర్వేకి వచ్చిన అధికారులకి‌ సమాచార సేకరణలో అడ్డంకులు సృష్టిస్తే చర్యలు తప్పవని, కావాలని బీఆర్ఎస్, బిజేపి సర్వే ని తప్పుత్రోవ పట్టిస్తున్నారన్నారు మంత్రి పొన్నం.

Change Boarding Station: రిజర్వేషన్ టిక్కెట్‌లోని బోర్డింగ్ స్టేషన్‌ను ఎలా మార్చుకోవాలంటే?

తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ రే లాగ సర్వే చేస్తుందని, సర్వేలో అభ్యంతకర‌ అంశాలు‌ ఉంటే చెప్పకండని, కేటీఆర్ ఢిల్లీ కి,అమెరికా కూడా పోవచ్చన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తి‌ గల్లిలో కుస్తీ అని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ అరెస్టు విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, కేటీఆర్ ను జైలుకు‌ పంపుతా అనడానికి నేను బండిసంజయ్ ‌ని‌ కాను అని, బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లని ధాన్యం కేటాయించేది లేదని, రైతుల ధాన్యం ప్రభుత్వం ‌కొంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. రైతులని వేధిస్తే ఉపేక్షించం. ఢిపల్టర్లని ప్రక్కన బెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, కాటన్ రైతులు‌ కూడా‌ ఇబ్బందులు పడుతున్నారు.. కేంద్ర ప్రభుత్వం కాటన్ రైతులకి ఇబ్బందులు లేకుండా కొనాలన్నారు. కేంద్రం, రాష్ట్ర ‌ప్రభుత్వాలు కలిసి రైతులకి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుందామని, బీజేపి వాళ్లు వచ్చి ధాన్యం కొనుగోలు దగ్గర నిరసన తెలిపితే, మేము జిన్నింగ్ మిల్లుల దగ్గరికి వెళ్లి నిరసన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండన్నారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ 600 బస్సులు కొనుగోలు చేయించాలని ఆలోచన చేస్తుందని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగానే మహిళా శక్తి కాంటీన్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

Asian Champions Trophy 2024: భారత్ వరుసగా రెండో విజయం.. దక్షిణ కొరియాపై గెలుపు