తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి బలోపేతానికి ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన మహిళా సమాఖ్యల సమావేశంలో ఆమె కీలక ప్రసంగం చేశారు.
CM Revanth Reddy: రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “వనమే మనం… మనమే…
ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. ఏ రోజు తాను సీఎంగా అహంకారానికి పోలేదని చెప్పారు. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తామని.. ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని తెలిపారు. సంగారెడ్డి…
ఉచిత బస్సు పథకం తెలంగాణ మహిళలకు మరింత ఉపయోగకరంగా మారిందని మంత్రి సీతక్క చెప్పారు. మంగళవారం హనుమకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆమె ప్రసంగిస్తూ, ఈ పథకంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయనే ఆరోపణ చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, కేటీఆర్ సిరిసిల్ల నేతన్న ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.