గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అధికారంలో నేతన్నల మీద ఉంది శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నేతన్నల కోసం ప్రయోజనాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. కేంద్రము చేనేత బోర్డ్ రద్దు చేసిన పార్టీ బీజేపీ అని, బండి సంజయ్ ని డిమాండ్ చేస్తున్న తమిళ్ నాడు కు ఎన్ని నిధులు ఇచ్చింది, తెలంగాణను ఎన్ని ఇచ్చారు నేను 10 తేదీన పూర్తి వివరాలు ఇస్తానన్నారు.
అంతేకాకుండా..’మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ కి ఇచ్చారు సిరిసిల్లకు ఎందుకు ఇవ్వలేదు. ఈ పాపం ఎవరిది కేటీఆర్, మీరు చేసింది కదా. నేతన్నలకు మూడు వందల యాభై కోట్లు ఎందుకు చెల్లించలేదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఇక్కటన్న నెరవేర్చావా కేసీఆర్. నేతన్నలు కు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తాం. ఎవరు ఆందోళన చెందొద్దు. మా ప్రభుత్వం వస్త్రాలు తీసుకోవాలి అని జివో తీసుకొచ్చాం. మూడు నెలలలో సిరిసిల్ల కి 130 కోట్ల ఆర్డర్ ఇచ్చినం. ఇక్కడి నుండి వస్త్ర పరిశ్రమ ఎగుమతులు చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. నేతన్నల కు జోడించి చెపుతున్న చావులు పరిష్కారం కాదు. రెండు పార్టీ మాటలు వినద్దు అన్ని విధాలుగా ఆదుకుంటాం. గత ప్రభుత్వాల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చి ఆదుకుంటాం. నేతన్న ల బకాయిలు విడుతల చెల్లిస్తాం, అరు లక్షల కోట్లు భరిస్తున్నం. మీరు పథకాలు ఏవైతే ప్రంభించారో వాటికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చి ఆదుకుంటాం.
సిరిసిల్ల నేతన్నల చిప్ప చేతుల పెట్టి మేఘ టెక్స్టైల్ పార్క్ తరలిచుకపోయింది వినోద్ కుమార్. బీజేపీ రాముని ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగే పరిస్థితి ఉంది. నేతన్నలు మీరు రెండు పార్టీల ట్రాప్ లో పడకండి మేము ఉన్నాం. నేతన్నల సమస్యలు చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. కరెంటు సబ్సిడీ ఇస్తూ బిసి కార్పొరేషన్ లో లోన్లు ఇచ్చి ఆదుకుంటాం. నేతన్నల, గీతన్న లు ఒక్కటే. ఒక్క మేఘ క్లస్టర్ తీసుకొచ్చే సోయి ఉందా రెండు పార్టీలకు. మహిళలు వడ్డీ లేని రుణాలను ఇచ్చి మా ప్రభుత్వం ఆడుకుంది. అంత్యోదయ కార్డులు రద్దు చేసింది ఇక్కడ కేటీఆర్ కదా…..? ఎన్నికల పేరు మీద శవ రాజకీయాలు చేయకండి. అధికారులు ఎవరన్నా నిర్లక్ష్యం చేస్తే ప్రజల ముందు నిలదీస్తాం. మనది ప్రజల ప్రభుత్వం, ఎవరు నిరాశ చెందొద్దు. కేంద్రం నిధులు ఇచ్చిన ఇవ్వకున్నన మేము అభివృద్ధి చేసి తీరుతాం. నేతన్నల కు భరోసా ఇవ్వడానికి నేను సిరిసిల్లకు వచ్చినా.’ అని పొన్నం ప్రభాకర్ అన్నారు.