Ponguleti Srinivas Reddy: తెలంగాణలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదు.. కాంగ్రెస్‌కు క్లియర్ మెజారిటీ పక్కా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy: ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారనే చూసే కాంగ్రెస్‌లో చేరానని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకున్నానని ఆయన తెలిపారు. నాకు స్వార్థం ఉంటే అధికార పార్టీలోనే ఉండే వాడినని ఆయన వెల్లడించారు. కేంద్రం నుంచి నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని.. వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తామన్నారని.. కానీ కేంద్రం ఇస్తు్న్న ఆ ఆఫర్లను చూసి నవ్వి ఊరుకున్నానని ఆయన చెప్పారు. తుమ్మలకు నాకు ఎలాంటి వైరం లేదని పొంగులేటి పేర్కొన్నారు. తుమ్మలను నేను ఓడించాననేది నిజం కాదన్నారు.
కూతురి పెళ్లి కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాననేది అవాస్తవమని పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సభల్లో నాపై సీఎం కేసీఆర్ ఆక్రోశం వెళ్లగక్కారని.. నాకు డబ్బు మదం ఉందని కేసీఆర్ మాట్లాడారని ఆయన చెప్పారు. ధనం బలం కాదు.. జన బలం ఉంటే ఏదైనా జరుగుతుందని ఆయన అన్నారు. డబ్బుతో రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ నేతలేనని పొంగులేటి స్పష్టం చేశారు. డబ్బుతో ఏమైనా చేయగలమనే అహంకారం నాకుందా? కేసీఆర్‌కు ఉందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే తెలిసే ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన చెప్పారు. బలమైన నేతలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. ఐటీ దాడుల్లో బీఆర్ఎస్ నేతలను వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Also Read: Ponguleti Srinivas Reddy Exclusive Interview: ఎన్టీవీ లైవ్‌లో పొంగులేటి..
వ్యాపార రీత్యా సీఎం జగన్‌ను కలిస్తే తప్పేంటని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డితో వ్యాపార విషయాలు తప్ప రాజకీయాల గురించి మాట్లాడలేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దనే షర్మిల కోరుకున్నారని.. అందుకే షర్మిల కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని తెలిపారు. షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరికి ఏం పదవి వస్తుందన్నది చెప్పలేమన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నేదే అందరి తపన అని ఆయన పేర్కొన్నారు. నన్ను ఓడించేందుకు కేసీఆర్ ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరన్నారు. తెలంగాణలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు క్లియర్ మెజారిటీ ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు బినామీ అనేది అబద్ధమని.. జగన్‌ను కలిసినప్పుడు నిందలు మోపడం సాధారణమన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?