ఎన్నికలు వస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏదో ఒక పధకం ప్రకటన చేశారని, ప్రజలను మభ్యపెడతారని ఆరోపించారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధ్భుతంగా ప్రసంగాలు చేసి ప్రజలను నమ్మించగలననే నమ్మకంతో కేసీఆర్ ఉంటారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ బిడ్డలంతా రుణపడి ఉన్నారని, కేసిఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఒకవైపు, కేసిఆర్ మరో వైపు ఉంటేనే గెలుపు సాధ్యమనే అభిప్రాయానికి వచ్చామని ఆయన వెల్లడించారు. అందుకు సరైన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే అభిప్రాయానికి వచ్చామని, జూలై 2 వ తేదీన కనీవినీ ఎరుగని రీతిలో భారీ భహిరంగ సభ ను ఏర్పాటు చేస్తామన్నారు పొంగులేటి.
Also Read : Delhi Good Thieves: ‘మంచి’ దొంగలు.. పైసలు లేవని, వంద పెట్టి వెళ్లారు
తెలంగాణ సరిహద్దు జిల్లా ఖమ్మంలో గతంలో ఎంతో ఘనంగా సభను నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నేతలకు సవాల్ చేస్తున్నాని ఆయన అన్నారు. తెలంగాణ బిడ్డలు కోరుకున్నది ఇంకా దక్కలేదన్న పొంగులేటి..పదవులు ఒక్కటే ముఖ్యం కాదన్నారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారని..పదవులకంటే ఆత్మాభిమానం ముఖ్యమన్నారు. సోనియా ఇచ్చిన తెలంగాణ ఫలాలు ఎవరికీ దక్కలేదన్నారు. ప్రజలు, యువత ఏమి కోరుకుంటున్నారని విషయం తెలుసుకున్నామని..కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం దక్కలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Also Read : NTR: ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి.. వీరికి ఒక సాంగ్ పడితే ఉంటుంది సామీ