NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్- యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఒక 10 రోజులు ఎన్టీఆర్ దుబాయ్ వెకేషన్ కు వెళ్లినట్లు సంచర్మ. ఇకపోతే కొన్నిరోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడట.. తండ్రికొడుకులుగా ఎన్టీఆర్ కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దేవర తండ్రి అని.. ఆయన కొడుకు క్లాస్ లుక్ లో కనిపిస్తాడని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో మరో హీరోయిన్ ను ఛాన్స్ ఉందని సమాచారం.
Pawan Kalyan: ప్రభాస్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు..
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇంకో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకొనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్ నడుస్తోంది. కథ, పాత్ర నచ్చితేనే సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో కూడా ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో శివ కొరటాల.. సాయి పల్లవిని సంప్రదించే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఈ వార్త వినగానే ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ మాములుగా రాలేదు.. ఎందుకంటే.. టాలీవుడ్ లో నెం. 1 డ్యాన్సర్ గా ఎన్టీఆర్ కు పేరుంది.. సాయి పల్లవి మొదటినుంచి డ్యాన్సర్. సాయి పల్లవి డ్యాన్స్ ఎలా ఉంటుందో అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వీరిద్దరి కాంబోలో ఒక సాంగ్ పడితే.. రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.