Robbers Stopped A Couple To Rob Them But Changed Their Plan: దొంగల పనేంటి..? బెదిరించామా, దోపిడీ చేశామా, వెళ్లిపోయామా, అంతే. అవతల వ్యక్తుల పరిస్థితి ఏంటి? వారి ధనవంతులా, కాదా? అనేది దొంగలకు అనవసరం. దోచుకోవడమే వారి ప్రధాన లక్ష్యం. కానీ.. అందరూ దొంగలు ఇలాగే ఉండరని, అప్పుడప్పుడు కొందరు మంచి దొంగలు కూడా వెలుగు చూశారు. దొంగలించిన సామాన్లు తిరిగి ఇచ్చేయడమో, ఏమీ లేవని తిరిగి దొంగలే ఆర్థిక సహాయం చేయడమో వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో తాజాగా అలాంటి వ్యవహారమే వెలుగుచూసింది. ఓ జంటని దోచుకుందామని ఇద్దరు దొంగలు ప్లాన్ చేయగా.. వారి వద్ద ఏమీ లేవని తెలిసి, తిరిగి రూ.100 వారి చేతిలో పెట్టి వెళ్లిపోయారు.
NTR: ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి.. వీరికి ఒక సాంగ్ పడితే ఉంటుంది సామీ
ఆ వివరాల్లోకి వెళ్తే.. తూర్పు ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్ బజార్‌లో ఓ జంటను నడుచుకుంటూ వెళ్తోంది. సడెన్‌గా వారి ముందు ఒక బైక్ వచ్చి ఆగింది. ఆ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. బైక్ నుంచి వాళ్లిద్దరు దిగి.. తమకు డబ్బులు ఇవ్వాలని ఆ జంటని బెదిరించారు. తమ వద్ద ఏమీ లేదని, తమని వదిలేయమని ఆ జంట ప్రాధేయపడింది. అయినా ఆ దొంగలు వినిపించుకోలేదు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి.. వారిని తనిఖీ చేయడం ప్రారంభించాడు. వారి వద్ద నుంచి కేవలం రూ.20 నోటు మాత్రమే దొంగలకు దొరికింది. అంతే, అంతకుమించి ఆ జంట వద్ద ఏమీ లేదు. దీంతో.. తిరిగి దొంగలే సానుభూతితో దంపతుల చేతిలో రూ.100 పెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం తతంగమంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
Bride Kidnap: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వధువు మెడపై కత్తిపెట్టి కిడ్నాప్
ఈ ఘటనతో బెదిరిపోయిన ఆ జంట.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, జరిగిందంతా చెప్పారు. దీంతో పోలీసులు ఆ దొంగల్ని గాలించడం మొదలుపెట్టారు. దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఎట్టకేలకు ఆ ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు. వారిని దేవ్ వర్మ, హర్ష్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. వర్మ ఒక ప్రైవేట్ జీఎస్టీ సంస్థలో అకౌంటెంట్ కాగా, రాజ్‌పుత్ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. యూట్యూబ్‌లో గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా వీడియోల ద్వారా తాము ప్రభావితం అయ్యామని వాళ్లు తెలిపారు. నిందితుల నుంచి పోలీసులు 30 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.