చంద్రబాబు పర్యటనపై మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సెటైర్లు వేశారు. దళితులను అవహేళన చేసిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా అని ప్రశ్నించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా… దళితులు ఏమి పీకలేరు… అని మీరు అనలేదా..యర్రగొండపాలెంలో మీ పార్టీ ఇంచార్జి బాబును కూడా నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు అవమానించలేదా..ఏ చెట్టూ లేని చోట ఆముదపు వృక్షం లాంటి ఎరిక్షన్ బాబే అక్కడ మహా వృక్షం అని అనలేదా..అలాంటి పార్టీలో ఈ దళిత నాయకులు ఎలా కొనసాగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు మంత్రి సురేష్.
Read Also:Peddireddy Ramachandra Reddy: ఎలక్ట్రికల్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
నీ హయాంలో కొత్త జిల్లాల విషయం గుర్తుకురాలేదు. ఇప్పుడు మార్కాపురం జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్ముతారా అన్నారు. జగనన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటంతో పాటు ఒక జిల్లాకు ఎన్టిఆర్ పేరు కూడా పెట్టారు..ఇన్నాళ్లు గుర్తుకురాని ఎన్టిఆర్ పేరు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందేమిటి? అని మంత్రి ప్రశ్నించారు. నీ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కనబడితే ఒప్పుకోవు… సభల్లో మాత్రం జై ఎన్టీఆర్ అని అంటావు. రెండు నాలుకల ధోరణి నీకే సాధ్యం అని ఎద్దేవా చేశారు.
Read Also: Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐ సీఎన్‌జీ బుకింగ్స్ ప్రారంభం.. డెలివరీ, స్పెసిఫికేషన్స్ వివరాలు..