శాఖల కేటాయింపు తర్వాత సచివాలయానికి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వచ్చారు. ఈ క్రమంలో.. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే. హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్ రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులకు అధికారులు స్వాగతం పలికారు.…
Jupalli: కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు నేతలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఉదయం 9 గంటలకు వీరు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. అనంతరం వీరు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.
ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే చాలామంది రాజకీయ జీవితాలు దెబ్బతీంటాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మధ్యాహ్నం జరిగే కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశానికి జగ్గారెడ్డి హాజరుకానున్నారు. చిన్న పిల్లల చేష్టలుగా వ్యవహరిస్తే మరింత నష్టం జరుగుతుందని అన్నారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలసిందే. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభల్లో ఎక్కడా కనిపించడం లేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరుకానుండగా తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ సమక్షంలో ఇరువురు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది.