బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరుకానుండగా తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ సమక్షంలో ఇరువురు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది.