తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయన్నారు. తండ్రులు సంపాదించిన ఆస్తుల పంపకాల్లో, రాజకీయ పదవుల్లో పంపకాల్లో తేడాలున్నాయని.. అన్నలు వదిలిన బాణాలు.. అన్నల మీదికే చెల్లెలు గురిపేడుతున్నారన్నారు. ఏపీలో జగన్ పై చెల్లి, షర్మిల బాణం ఎక్కు పెడితే, తెలంగాణలో కేటీఆర్ పై కవిత గురి పెట్టిందని విమర్శించారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడాని, ప్రజల అవసరాల కంటే, కుటుంబ అవసరాలే కీలకం అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. మొన్న వైఎస్సార్ కుటుంబం.. ఇపుడు కేసీఆర్ కుటుంబం.. అన్నల పైకి చెల్లెలను ఉసి గోల్పడంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు వ్యతిరేకత మొదలైందని.. రేవంత్ బీద అరుపులు అరుస్తున్నారని విమర్శించారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకతను.. మళ్లించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
READ MORE: Sandeep Reddy : ఆ డైరెక్టర్ల బాటలో సందీప్ రెడ్డి..?
టీఆర్ఎస్ పుట్టి మునిగిపోయిందని.. దేశంలో బీజేపీ వెలిగిపోతోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. “తెలంగాణలో బీజేపీ బలపడింది.. భవిష్యత్ లో అధికారంలోకి కూడా రానుంది. కవిత లేఖ రాసింది వాస్తవమే.. కవిత కేసీఆర్ ను కలిసే పరిస్థితి లేదా? కేసీఆర్ ప్రతిపాదిస్తున్న కేటీఆర్ ను సవాలు చేస్తున్నట్టుగానే కవిత సవాలు అర్థం అవుతోంది. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించను అని చెప్పకనే చెపుతోంది. అన్న ఆధిపత్యాన్ని సవాలు చేయడమే లేఖాస్త్రం. కవిత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంది. భారత దేశం ఆర్ధికంగా అత్యంత బలోపేతంగా నిలుస్తోంది. భారత దేశం 4 వ ఆర్థిక అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందింది. భారత్ జపాన్‌ను అధిగమించింది. మోడీ నాయకత్వానికి తార్కాణం. వికసిత భారత్ కూడా కచ్చితంగా సిద్ధిస్తుంది.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: JC Prabhakar Reddy: రాబోయే ఎలక్షన్‌లలో చాలా పోటీ ఉంటుంది.. ప్రజలే మాకు దేవుళ్లు!
