CM Chandrababu: ఖాదీసంత గాంధీ ఆశయాలకు ప్రతీక అని సీఎం చంద్రబాబు అన్నారు.. మహాత్మాగాంధీ అంటే గుర్తొచ్చేది ఖద్దర్ అన్నారు.. స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రాట్నమే అని గుర్తు చేశారు.. తిండిపెట్డే రైతును గుర్తుపెట్టుకోవాలని లాల్ బహాదుర్ శాస్త్రి చెప్పినట్లు గుర్తు చేశారు. వారానికి ఒకరోజు సంతకు వెళతాం.. గ్లోబల్ సంతగా ఖాదీసంత తయారవుతుందనడానికి అనుమానం లేదు.. విదేశీ వస్త్రాలు, విదేశీ వస్తువులు అప్పుడు బహిరంగంగా తగులబెట్టారు.. అన్నిరకాల విలువలు కలిగిన దేశం భారతదేశం.. మనం ఎంత ఎదిగినా…
Raghunandan Rao: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) అంశంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. యుద్ధం చేసే ధైర్యం, దమ్ము ఉంటేనే మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. అలాగే ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. యుద్ధం అనేది మాటలతో మాట్లాడేది కాదు.. అది చేసేటోనికి తెలుస్తుంది. రేవంత్ రెడ్డిది నెత్తి కాదు, కత్తి కాదు.. అంటూ ఆయన…
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయన్నారు. తండ్రులు సంపాదించిన ఆస్తుల పంపకాల్లో, రాజకీయ పదవుల్లో పంపకాల్లో తేడాలున్నాయని.. అన్నలు వదిలిన బాణాలు.. అన్నల మీదికే చెల్లెలు గురిపేడుతున్నారన్నారు.
ఢిల్లీలో బీజేపీ విజయంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, ఆప్‌కు ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు.. 27 ఏళ్ల తర్వాత బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు. మోడీ సుపరిపాలనకు ప్రజలు ఆశీస్సులు అందించారు.. ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం.. దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైందని ఆరోపించారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్ నుంచి మౌలిక వసతుల కల్పన వరకు అన్ని అంశాల్లో ఆప్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్‌ను దేశ చరిత్రలోనే అతి దారుణమైన కుంభకోణంగా అభివర్ణించారు. ఈ సందర్బంగా ఆప్ పాలన వైఫల్యాలను చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రజలకు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుచేశారు. ఆసుపత్రుల…