రాఖీ పండుగ....గులాబీ పార్టీ ఇంటి గుట్టును బజారున పడేలా చేసిందా ? ఈ పండుగకైనా ఇంటి మనుషులు కలుస్తారేమో అనుకున్న క్యాడర్‌కి...నిరాశే మిగిలిందా ? ఎన్టీవీ వేదికగా రాఖీ కట్టడానికి సిద్ధమని చెల్లెలు చెప్పినా...అన్నయ్య మాత్రం అందుకు ససేమిరా అన్నారా ? అన్నాచెల్లెళ్ల వ్యవహారశైలి...తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య వార్ పీక్ స్టేజ్‌కి చేరుకుందా ?
ప్రాంతీయ పార్టీల రాజకీయమంతా... కుటుంబాల చుట్టూ తిరగడం, అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏవైనా పొరపొచ్చాలొస్తే... ఆయా పార్టీలు నిలువెల్లా షేకైపోవడం సర్వ సాధారణమైంది. దేశమంతటా ఇదే తరహా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ పరంపరలోనే... తాజాగా తెలంగాణ వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో అన్నా చెల్లెలు జగన్, షర్మిల మధ్య నడుస్తున్న వివాదాలు, జరిగిన, జరుగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కేటీఆర్ అసలు రంగు బయటపడిందని.. కేటీఆర్ ట్విట్టర్ లో కాదు.. జనాల్లోకి రా అని కవిత కూడా చెప్పిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కుటుంబంలో ఉన్న సవాళ్లకు సమాధానం చెప్పుకోలేని కేటీఆర్.. ప్రజలకు ఏం చేస్తాడు? అని ఎద్దేవా చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలిగిపోయిందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయన్నారు. తండ్రులు సంపాదించిన ఆస్తుల పంపకాల్లో, రాజకీయ పదవుల్లో పంపకాల్లో తేడాలున్నాయని.. అన్నలు వదిలిన బాణాలు.. అన్నల మీదికే చెల్లెలు గురిపేడుతున్నారన్నారు.