Duvvada Srinivas and Divvala Madhuri: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి తిరుమల పోటీసులు జారీ చేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఇటీవల తిరుమల కొండపై రీల్స్ చేసిన వివాదంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. తిరుమల మాఢ వీధుల్లో పబ్లి్క్ న్యూసెన్స్ చేశారని వారిపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
Read Also: Group -1 mains: జీవో 29 వర్సస్ 55 వివాదం ఏంటి..?
కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. దివ్వల మాధురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం వారిద్దరు కలిసి మాఢ వీధుల్లో హల్‌చల్ చేశారు. ఫోటోలకు ఫోజులివ్వడంతో పాటు తమ మధ్య ఉన్న సంబంధం గురించి వివరించారు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని.. కోర్టుల్లో కేసులు కొలిక్కివచ్చాక పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు. అయితే తిరుమలలో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. దివ్వల మాధురిపై కేసు నమోదైంది. అయితే తిరుమలలో తాము రీల్స్ చేశామనే ఆరోపణల్లో నిజం లేదని దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అయినప్పటికీ టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణలో భాగంగా నోటీసులు జారీ చేశారు.