జీవో 29ను రద్దు చేయాలంటున్న గ్రూప్‌ వన్‌ అభ్యర్థులు.. పాత జీవో 55 ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రం నిబంధనలపై వెనక్కి తగ్గేదే లేదంటోంది.

జీవో 55 ప్రకారమే పరీక్షలు ఉంటాయని చెబుతోంది. హైకోర్టు క్లియరెన్స్‌ ఇవ్వడంతో సోమవారం నుండి గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అటు విద్యార్థులు మాత్రం పట్టు వీడటం లేదు. 

ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఏం చెబుతుందని అనే ఆసక్తి నెలకుంది. ఈ జీవో వివాదం ఏమిటి అనేది చర్చ మొదలయింది. 

కేసీఆర్‌ ప్రభుత్వం 2022లో జారీ చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను కోర్టు తీర్పుతో 2024 రద్దు చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఆ సమయంలో కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ..జీవో 29ను తీసుకువచ్చింది. 

గత ప్రభుత్వం అమలు చేసిన జీవో 55లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో 40 శాతం అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం ఎంపిక చేస్తే.. 60 శాతం అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లను వర్తింపు చేస్తారు. 

దీంతో మెరిట్‌ ఉన్న రిజర్వుడు అభ్యర్థులు ఓపెన్‌ కోటాలో ఎంపికవుతారు. మెరిట్‌ తక్కువ ఉన్న అభ్యర్థులకు..రిజర్వుడు కేటగిరిలో అవకాశం లభిస్తోంది. 

దీనివల్ల అటు ఓపెన్‌ కోటాలోనూ..ఇటూ రిజర్వుడు కోటాలో కూడా రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుంది.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ప్రకారం.. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్‌ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

ఉద్యోగాల కేటాయింపులోనే రిజర్వేషన్లు వర్తింపు జేస్తారు. అందువల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడు అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కేటగిరీ కిందనే పరిగణిస్తున్నారు. 

దీనివల్ల రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నవారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అభ్యర్థుల వాదన. రిజర్వుడ్ అభ్యర్థులకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందని ఆరోపిస్తున్నారు అభ్యర్థులు. 

తమ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. 

దీనిపై అభ్యర్థుల ఆందోళనతో మంత్రులు వారితో మీటింగ్‌ ఏర్పాటు చేసి వారి డిమాండ్లపై సమగ్ర విచారించారు. ఇటు తెలంగాన మంత్రులు అటు సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి.