అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ వార్తపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం చేసింది. బాధ్యులైన వైద్యులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. అక్రమ కిడ్నీ రాకెట్ మార్పిడిపై తెలంగాణ వైద్య మండలి స్పందించి సుమోటోగా స్వీకరించి విచారణ చేయనున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) ప్రకటించింది.
Kidney Racket: హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై పోలీసులు తీవ్రమైన దర్యాప్తు జరుపుతున్నారు. కిడ్నీ రాకెట్ లో పాలుపంచుకున్న అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో పాల్గొన్న వైద్యుల కోసం కూడా విచారిస్తున్నారు. ఈ దందా ఎంతకాలంగా కొనసాగుతుందో? ఇప్పటివరకు ఎంతమందికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారో అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తిసుకున్నారు పోలీసులు. హాస్పిటల్ నిర్వాహకుడు సంపత్‌తో పాటు మరికొంత మంది…