Riti Saha Case: రీతి సాహ కేసులో దూకుడు పెంచిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రీతి సాహ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది.. జులై 14వ తేదీన భవనంపై నుంచి కిందపడి రీతి సాహ ప్రాణాలు కోల్పోయింది. నీట్ శిక్షణ కోసం కోల్కత్తా నుంచి విశాఖ వచ్చి చదువుకుంటున్న రీతి సాహా వ్యవహారం ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే, కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ విద్యార్ధిని తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్దిని ఆత్మహత్య వ్యవహారంలో ఏపీ పోలీసుల వైఖరిపై విద్యార్ధిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడం, బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో కేసు సంచలనంగా మారింది..
Also Read
దీంతో రీతి సాహ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. సీఐడి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో అరెస్టుల పర్వం మొదలయింది. బెంగాల్ విద్యార్థిని మృతి కేసులో ఇప్పటి వరకు నలుగురి పోలీసులు అరెస్ట్ చేశారు. సాధన హాస్టల్ కు చెందిన ఇద్దరు, బైజుస్ యాజమాన్యంకి చెందిన ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సాధన హాస్టల్ ఓనర్ లక్ష్మీ, వార్డెన్ కుమారి.. ఆకాష్ బైజూస్ కాలేజీ మేనేజర్ సూర్యకాంత్, అసిస్టెంట్ మేనేజర్ రామేశ్వర్ ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే రీతి సాహ చనిపోయినట్టు విశాఖ పోలీసులు నిర్ధారించారు. వెంకటరామ, కేర్ హాస్పిటల్ లలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతుంది. వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గత నాలుగు రోజుల నుంచి విశాఖలోనే సీఐడి, బెంగాల్ పోలీసులు మకాం వేశారు.
Read Also: Thailand: థాయ్ మాజీ ప్రధాని జైలు శిక్ష ఎనిమిదేళ్ల నుంచి ఏడాదికి తగ్గింపు
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..