CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- సీజేపీ కో కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..
- గతంలో సంతకం చేసిన ‘‘బాండ్’’ను ఉల్లంఘించినట్లు పేర్కొన్న కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: ఆంక్షలను ఉల్లంఘించి జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మహేష్ కుమార్ మీనా 5 రోజులు జ్యుడీషియల్ కస్టడీని విధించారు. కస్టడీ విధిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించమని బాండ్లు సమర్పించినప్పటికీ, విడుదలైన తర్వాత మళ్లీ నిషేధిత స్థలమైన జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చారని, ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నించారని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్టోబర్ 14న మేజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో సీజేపీ ఇద్దరు నేతలు చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నాయి.
అక్టోబర్ 10 తర్వాత బాండ్‌పై సంతకం..
అక్టోబర్ 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఆ సమయంలో ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చని అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విమానంలోనే అరెస్ట్ చేశారు. తర్వాతి రోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉంందన్న కారణంతో BNSSలోని సెక్షన్లు 126, 170 కింద ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ముగ్గురు కూడా తమ తప్పు అంగీకరించారని శాంతి, సత్ప్రవర్తనను కాపాడేందుకు ఒక్కొక్కరు రూ.50 వేల వ్యక్తిగత బాండ్, ష్యూరిటీ బాండ్ సమర్పించారని పోలీసులు తెలిపారు. ఏడాది కాలం పాటు శాంతిభద్రతలను కాపాడాలని అప్పటి ఉత్తర్వుల్లో ముగ్గురు సంతకం చేశారు. మరోవైపు తాము ఏ బాండ్‌పై సంతకం చేయలేదని సీజేపీ నేతలు చెబుతున్నారు.
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ఇప్పుడు మళ్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనకు ప్రయత్నించడం, ఆంక్షల్ని ఉల్లంఘించడం, అధికారులు విధులకు అడ్డుకోవడం వంటి ఆరోపణలతో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. అక్టోబర్ 13న కొందరు వ్యక్తులతో కలిసి ఇద్దరూ జేడీయూ ఆఫీస్ గోడ దూకి జంతర్ మంతర్ వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ అంతరాయం కలిగించారని ఫిర్యాదు పేర్కొంది. 5 రోజులు జ్యడీషియల్ కస్టడీ తర్వాత అక్టోబర్ 19కి తదుపరి విచారణ వాయిదా వేశారు. మరో సీజేపీ నేత అజింక్య షిండేకు 6 నెల లపాటు శాంతి, సత్ర్పవర్తన కాపాడాలని ఆదేశించి, రూ. 5000 వ్యక్తిగత బాండ్, ష్యూరిటీపై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..