తాజాగా కదులుతున్న రైలు నుంచి ఓ టీటీఈని ఓ టికెట్ లేని ప్రయాణికుడు తోసేయడంతో టీటీఈ అక్కడికక్కడే మృతి చెందారు. తోసేయడంతో టీటీఈ అవతలి పట్టాలపై పడగా, సరిగ్గా అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీ కొట్టడంతో టీటీఈ అక్కడిక్కడే చనిపోయారు. బాధితుడు టీటీఈ ఎర్నాకులం నివాసి కె. వినోద్ గా పోలీసులు గుర్తించారు. రైలు ఎర్నాకుళం నుంచి పట్నా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
Also read: Earthquake : తైవాన్‌లో భూకంపం.. భారీ విపత్తు.. సునామి హెచ్చరికలు జారీ
ఇక ఈ విషయం సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., టీటీఈ తన విధుల్లో భాగంగా నిందితుడిని టికెట్ అడగడంతో ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఈ ఘటన త్రిసూర్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెలప్పయ్య ప్రాంతంలో రైలు ప్రయాణిస్తుండగా జరిగింది. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితుడు పాలక్కాడ్ వద్ద ఒడిశాకు చెందిన రజనీకాంత్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇకపోతే నిందితుడు రజనీకాంత్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఎర్నాకులం – పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలులోని S11 కోచ్ లో ఉన్న నిందితుడు రజనీకాంత్ ని టీటీఈ వినోద్ టికెట్ అడిగారు. అయితే అందుకు నిందితుడు టికెట్ లేదని అతడు చెప్పగా.., అలా ప్రయాణించడం కుదరదని టీటీఈ వినోద్ చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరగగా.. ఆపై ఒక్కసారిగా టీటీఈ వినోద్ ను రజనీకాంత్ రైలు నుంచి తోసేశాడు. దాంతో అవతల ఉన్న పట్టాలపై పడిన వినోద్ కు తీవ్రగాయాలు అవ్వగా., ఇంతలో అటు నుంచి వస్తున్న మరో రైలు ఢీ కొట్టడంతో టీటీఈ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సంబంధించి కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ మొదలు పెట్టారు.