Andhra Pradesh Crime: మహిళలపై నిత్యం ఏదో ఒక దగ్గర లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. పసికూనల నుంచి పండు ముసలి వరకు లైంగిక దాడులు జరుగుతోన్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పనికూనలు, చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు ఇలా తేడా లేకుండా మృగాళ్లు రెచ్చిపోతున్నారు.. నిందితులను అరెస్ట్ చేస్తున్నా.. కఠిన శిక్షలు పడుతున్నా.. ఈ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, మూగ జీవాలు, పశువులు, పెంపుడు జంతువులపై కూడా లైంగిక దాడులకు సంబంధించిన ఘటలు బయటకు వస్తున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణమైన వ్యహారం వెలుగు చూసింది.. శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండల పరిధిలోని రాచువారిపల్లిలో పశువులపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడో వ్యక్తి.. రాత్రి వేళల్లో లేగదూడలపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు.. ఇదేం పనిరా? అంటూ మందలించినందుకు మాపై దాడికి కూడా పాల్పడ్డాడంటూ కొందరు స్థానికులు, రైతులు పుట్టపర్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పుట్టపర్తి రూరల్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Read Also: Most Miserable Country: అత్యంత “దుర్భరమైన దేశం”గా జింబాబ్వే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే..?