పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజాభివృద్ధికి వారిని సిద్ధం చేస్తారు. అయితే మహారాష్ట్రలో ఓ ఉపాధ్యాయుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. లాతూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఈ మేరకు ఆదివారం ఓ పోలీసు అధికారి వెల్లడించారు. శుక్రవారం కేసు నమోదు చేశామని, ఒకరోజు తర్వాత అతన్ని అరెస్టు చేశామన్నారు.
READ MORE: CM Revanth Reddy: గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ సమీక్ష
పోలీసుల కథనం ప్రకారం.. హారంగుల్ (ఖుర్ద్)లోని జిల్లా పరిషత్ పాఠశాలలో అన్న శ్రీరంగ్ నర్సింగే ఇన్‌చార్జి మాజీ ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థినులను అనుచితంగా తాకడం, ఐలవ్‌యూ అని పిలిచేవాడని పలువురు విద్యార్థినులు ఆరోపించారు. 16 మంది విద్యార్థినుకు కాళ్లు, చేతులను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదు చేశారు. గత 2021 ఏడాది నుంచి ఇలాగే ప్రవర్తించాడు. ఇక్కడ జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే పరీక్షలో మార్కులు ఇవ్వనని బెదిరించాడు. అయినా.. విద్యార్థినులు ధైర్యంగా ఫిర్యాదు చేశారు. బాలికలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా పరిషత్ విచారణ ప్రారంభించింది. అనంతరం బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నివృత్తి జాదవ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించార. ఈ మేరకు నిందితుడిపై భారత న్యాయ స్మృతి 75(2), 75(3), 78(2), 79, పిల్లల రక్షణ సెక్షన్ల కింద లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. తాజాగా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
READ MORE:Indian Passengers: ఆహారం, సాయం లేకుండా కువైట్ ఏయిర్‌పోర్టులో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులు..