Karnataka: కర్ణాటక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. బీదర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. పదేపదే అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఫిర్యాదు ప్రకారం, డిసెంబర్ 25, 2023లో సదరు బాధిత మహిళతో ప్రతీక్ చౌహాన్ ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థం తరువాత పెళ్లి హామీతో పలుమార్లు మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది.
Waqf Board: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో రైతులకు సంబంధించిన 300 ఎకరాల భూమిని ‘‘వక్ఫ్ బోర్డ్’’ క్లెయిమ్ చేయడంపై వివాదం ప్రారంభమైంది. అయితే, అక్కడి రైతులు మాత్రం ఈ భూములు తమకు తరతరాలుగా సంక్రమించాయని చెబుతున్నారు. ఇటీవల ఈ భూములు తమవే అంటూ వక్ఫ్ బోర్డు రైతులకు నోటీసులు పంపింది. 103 రైతులు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు.
మహారాష్ట్రలోని లాతూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఈ మేరకు ఆదివారం ఓ పోలీసు అధికారి వెల్లడించారు. శుక్రవారం కేసు నమోదు చేశామని, ఒకరోజు తర్వాత అతన్ని అరెస్టు చేశామన్నారు.