Bangladeshi Nationals Arrested: కర్ణాటకలోని చిత్రదుర్గలోని హోల్‌కెరె రోడ్డులో నవంబర్ 18న పెట్రోలింగ్ చేస్తున్న ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు ఆరెస్ట్ చేసారు. ఈ వ్యక్తులు చాలా ఏళ్ల క్రితం కోల్‌కతా నుంచి అక్రమంగా చొరబడి భారత సరిహద్దులలోకి వచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో షేక్ సాయిపూర్ రోహ్మాన్, మహ్మద్ సుమన్ హుస్సేన్ అలీ, మజరుల్, అజీజుల్ షేక్, మహ్మద్ సాకిబ్ సిక్దార్, సన్వర్ హుస్సేన్ లు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Breaking news: అన్నంత పని చేసిన ఉక్రెయిన్.. రష్యాపైకి ATACMS మిస్సైల్ ఫైర్..
చిత్రదుర్గ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు, వారి వద్ద లభించిన పత్రాలను విచారించి, పరిశీలించిన తరువాత.. వీరు బంగ్లాదేశ్ పౌరులని తేల్చారు. వీరు చాలా ఏళ్ల క్రితం అక్రమంగా చొరబడి భారత్‌కు వచ్చారని అధికారులు తెలిపారు. తొలుత పశ్చిమ బెంగాల్ నుంచి భారత్ లోకి ప్రవేశించి కోల్‌కతాలో నకిలీ ఆధార్ కార్డు, ఇతర పత్రాలు తయారు చేసుకున్నారు. భారత్లోకి ప్రవేశించిన తర్వాత వారు తన జీవనోపాధి కోసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పని చేస్తూనే ఉన్నారు. ఉపాధి పనుల నిమిత్తం ఇటీవల చిత్రదుర్గ నగరానికి చేరుకున్నారు.
Read Also: Border Gavaskar Trophy: అశ్విన్, లియోన్ మధ్య ఆధిపత్య పోరు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విజయం ఎవరిదో?
తదుపరి చట్టపరమైన చర్యల కోసం వారి నుంచి నకిలీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, లేబర్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పైన పేర్కొన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించబడ్డాయి.