హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ల్యాండ్ గ్రాబర్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు సభ్యులు గల ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్‌లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు ముఠా స్కెచ్ వేసింది.
హైడ్రా కమిషనర్‌కు అమీన్‌పూర్ బాధితుల ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసిన అమీన్‌పూర్ బాధితులు.. మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటీశ్వరరావు అనే వ్యక్తుల దగ్గర ప్లాట్లు కొని మోసపోయామంటూ ఫిర్యాదు చేశారు.
ED Raids On AAP MP House: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోరా ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈరోజు (సోమవారం) తనిఖీలు చేశారు. ఒక భూ వివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో జలంధర్‌లోని ఎంపీకి చెందిన పలు చోట్ల సోదాలు కొనసాగిస్తుంది.