ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న #SSMB29 సినిమాలో నటిస్తున్న ప్రియాంక చోప్రా గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ #SSMB29 ప్రాజెక్ట్ తో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేస్తోంది ఆమె. గ్లాబ్ ట్రాటింగ్ మూవీగా ప్రచారం చేస్తున్న ఈ సినిమాలో తన పాత్ర ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ ఇప్పుడు ముంబైలోని తన ఆస్తులను అమ్మేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అమెరికన్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత, ప్రియాంక లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడింది. దీనితో భారతదేశంలో ఆమె రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కొన్నింటిని అమ్మకానికి సిద్ధమవుతోంది. ఆమె ముంబైలో అనేక లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను విక్రయించిందని తెలుస్తోంది.
Naga Chaitanya: వెకేషన్లో కొత్త జంట!
ఈ నెలలో మొత్తం ₹13 కోట్ల విలువైన అపార్టుమెంట్లు అమ్మిందని అంటున్నారు. 2000ల ప్రారంభంలో ఆమె బాలీవుడ్ కెరీర్‌లో పీక్స్ లో ఉన్నపుడు ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టిన ఈ ఆస్తులు ఇప్పుడు ఆమెకు గణనీయమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. ఇక జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా కొన్ని డేస్ షూట్ లో పాల్గొంది. అయితే, దర్శకుడు ఆమెను తదుపరి షూటింగ్‌ల కోసం అడిగినప్పుడల్లా ఆమె సెట్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరికీ తెలిసినట్లుగా, రాజమౌళి సినిమాలు పూర్తి కావడానికి ఒకటి లేదా రెండు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఆమె హైదరాబాదులోనే కొన్నాళ్ల పాటు ఉండాల్సి ఉంటుంది.