బెంగళూరు నగరంలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి రాష్ట్రం లో పలు చోట్ల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బెంగళూరు లోని వెస్ట్ డివిజన్ లోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఆయుధశాల గోడ కూలిపోయింది.