PSL 2024: మ్యాచ్ మధ్యలో ఆ పని చేసిన పాకిస్తాన్ క్రికెటర్.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imad Wasim Smokes A Cigarette In PSL 2024 Final: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎసీఎల్) 2024 ఫైనల్‌లో ముల్తాన్ సుల్తాన్‌పై విజయం సాధించిన ఇస్లామాబాద్ యునైటడ్ టైటిల్ సాదించింది. ఇస్లామాబాద్ విజయంలో ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో తన కోటా 4 ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌లో కీలకమైన 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇమాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను అతడికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. పీఎసీఎల్ 2024 ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసి అందరిని అకట్టుకున్న ఇమాద్.. ఓ పాడు పని చేసి విమర్శల పాలయ్యాడు.
పీఎసీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా ఇమాద్ వసీం డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగాడు. ఇస్లామాబాద్ యునైటడ్ డ్రెసింగ్ రూంలో ఎంచక్కా సిగరెట్ అంటించుకుని, దాన్ని తాగుతూ ఎంజాయ్ చేశాడు. ఈ తతంగాన్ని కెమెరామెన్ బంధించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురుపిస్తునారు. ‘మ్యాచ్ జరుగుతుండగా ఇదేం పాడు పని’, ‘ఇమాద్ వసీంపై కఠిన చర్యలు తీసుకోవాలి’, ‘పీఎసీఎల్ అంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు పాకిస్తాన్ స్మోకింగ్ లీగ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
Also Read: IPL 2024: విశాఖ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. ప్రాక్టీస్‌లో బిజీబిజీ!
పాకిస్తాన్ జట్టులో ఇమాద్ వసీం కీలక ఆటగాడిగా ఎదిగాడు. పాక్ తరఫున 55 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. పరిమిత ఓవర్లలో 1300 పరుగులు, 109 వికెట్స్ పడగొట్టాడు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇమాద్ టీ20 స్పెషలిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. పీఎసీఎల్ 2024 ఫైనల్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 రన్స్ చేసింది. ఛేదనలో ఇస్లామాబాద్ యునైటడ్ 20 ఓవర్లలో 8 వికెట్స్ కోల్పోయి 163 రన్స్ చేసి గెలిచింది.
PAKISTAN “SMOKING” LEAGUE 🚬🔥🔥#HBLPSL9 #HBLPSLFinal pic.twitter.com/pwpaj4bLh8
— Farid Khan (@_FaridKhan) March 18, 2024
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?