Jupalli Krishna Rao: పండుగ రోజున ప్రెస్ మీట్ పెట్టల్సిన పరిస్థితి మాజీ మంత్రి కేటీఆర్ కల్పించారని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. డిసెంబర్ లో కొల్లాపూర్ లో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. వ్యక్తిగత కారణాల వలన, భూ తగాదాలతో హత్య జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు తెర మీదికి ఆ హత్యను ఎందుకు తీసుకు వచ్చారు? ప్రశ్నిచారు. హంతకులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కొందరు ఆల్రెడీ పోలీస్ ల అదుపులో ఉన్నారని అన్నారు. 1999 నుండి ఇప్పటి వరకు ఎన్నికల్లో నా మెజార్టీ పెరుగుతూ వస్తుందని, తన విలువలుతో కూడిన రాజకీయాలు చేస్తానని అన్నారు.
మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి బీజేపీ సానుభూతి పరుడని అన్నారు. కానీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారని తెలిపారు. ఎన్నికల కోసం కేటీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ సర్పంచ్… బీఆర్ఎస్ పార్టీ లో చేరడం లేదని కాంగ్రెస్ సర్పంచ్ ను హత్య చేశారని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో జెట్పీటీసీ హనుమంత్ నాయక్, సర్పంచ్ ల పై అక్రమ కేస్ లు, మర్డర్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేవారు. తన నియోజక వర్గంలో బీఆర్ఎస్ పాలనలో చాలా మందిని హత్యలు చేశారని గుర్తుచేశారు. చేయని వాటికి చేశానని తనపై బురద చల్లుతున్నారు… నా ప్రతిష్టకు భంగం కలిగించే లాగా మాట్లాడుతున్నారని.. రాజకీయాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు.
Read also: Jogi Ramesh: నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి నాకు పెనమలూరుతో సంబంధాలు.. జెండా ఎగరడం ఖాయం..
గతంలో మా నియోజక వర్గంలో జరిగిన ప్రతి హత్య పై సాక్ష్యదారాలతో సహా గతంలో డీజీపీకి పిర్యాదు చేసిన అప్పుడు ఎవరు పట్టించుకోలేదని అన్నారు. అప్పుడు జరిగిన హత్యల గురించి ఆనాడు ప్రగతి భవన్ లో ఉన్న పెద్దలకు చెప్పిన ఎవరు పట్టించుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మీరు జనాలను పట్టించుకోలేదు కాబట్టి మిమ్ములను జనాలు ఓడగొట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. కొండగట్టులో 60 మంది చనిపోతే మీరు వెళ్ళలేదు కానీ వ్యక్తిగత కారణాలు, భూ వివాదాల వలన చనిపోయిన వ్యక్తి చావుతో శవ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. గతంలో జరిగిన అన్యాయ ,అక్రమాల పై విచారణ చేపడతామన్నారు. మల్లేష్ యాదవ్ ఘటన పై విచారణ చేపిస్తున్నాము. సూత్రధారులను అరెస్ట్ చేస్తామన్నారు.
మీ ప్రభుత్వంలో వామన రావు కుటుంబ సభ్యుల హత్య, అక్రమ కేస్ లు, మరియమ్మ ఘటన, దిశ ఘటన, ఎఫ్ఆర్ఓ శ్రీనివాస రావు,మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంభం అగాయిత్యలు, తమ్మినేని కృష్ణ హత్యలు జరగలేదా? అని ప్రశ్నించారు. మా పాలనలో రాజకీయ కక్ష పూరితమైన కేస్ లు, అరెస్ట్ లు ఉండవన్నారు. దొంగలను వెనుకకు వేసుకుని వచ్చింది ఎవరు..గత ప్రభుత్వంలో మీరు కాదా? అని ప్రశ్నించారు. రాజకీయ హత్యలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. తను తప్పులు చేస్తే జనాలు 7 సార్లు గెలిపిస్తారా? అని తెలిపారు. ఎన్ని సార్లు చెప్పిన మీ పద్దతి మారడం లేదని మిమ్మల్ని జనాలు ఒడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Al Maha Rashed : మూడేళ్ల వయసులో రెండు పుస్తకాలు రాసి హిస్టరీ క్రియేట్ చేసిన చిన్నారి