Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Pm Modi Tweet On Brs And Congress Parties

Narendra Modi: రేపు తెలంగాణ పర్యటనకు వస్తూనే.. ఆ పార్టీలపై ప్రధాని మోడీ విమర్శలు

Published Date :September 30, 2023 , 10:09 pm
By NTV WebDesk
Narendra Modi: రేపు తెలంగాణ పర్యటనకు వస్తూనే.. ఆ పార్టీలపై ప్రధాని మోడీ విమర్శలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని నరేంద్ర మోడీ రేపు (ఆదివారం) తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనకు ముందు కాంగ్రెస్ , బీఆర్ఎస్‌లపై ఆయన విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు. ‘రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను మహబూబ్‌నగర్‌లో @BJP4Telangana ర్యాలీలో ప్రసంగిస్తాను.. అసమర్థ బీఆర్‌ఎస్‌ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం లేదని ఆయన ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేని వంశ పారంపర్య పార్టీలు’’ అంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.

Read Also: Vande Bharat Trains: ఇకపై 14 నిమిషాల్లోనే వందేభారత్ రైళ్లు శుభ్రం..

ఇక, మహబూబ్‌నగర్‌లో రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను 13,500 కోట్ల రూపాయలకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ , రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురు చూస్తున్నాను అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అయితే, మరోవైపు రేపటి ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ మరోసారి దూరంగా ఉండనున్నారు. ఆయనకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలుకనున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆయన ఇంకా కోలుకోనందునే తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కూడా వాయిదాపడింది.

Read Also: Goods Train: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ జిల్లాలో ఘటన

ప్రధాని మోడీ షెడ్యూల్ :

రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోడీ..
1.35కి ఎయిర్‌పోర్ట్ నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మహబూబ్‌నగర్‌కు పయనం.
మధ్యాహ్నం 2.05 గంటలకు పాలమూరుకు చేరుకోనున్న ప్రధాని మోడీ
మధ్యాహ్నం 2.15 నుంచి 2.50 వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్న మోడీ
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ నిర్వహిస్తున్న సమరభేరి సభలో పాల్గొననున్న ప్రధాని
అనంతరం హెలికాఫ్టర్‌లో సాయంత్రం 4.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు పయనం

రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను మహబూబ్‌నగర్‌లో @BJP4Telangana ర్యాలీలో ప్రసంగిస్తాను. అసమర్థ బీఆర్‌ఎస్‌ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. ప్రజలు కాంగ్రెస్‌పై కూడా అంతే అవిశ్వాసంతో ఉన్నారు . BRS, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేని వంశపారంపర్య పార్టీలు.

— Narendra Modi (@narendramodi) September 30, 2023

మహబూబ్‌నగర్‌లో రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను రూ. 13,500 కోట్లకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ , రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నాను. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.…

— Narendra Modi (@narendramodi) September 30, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP Meeting
  • BRS Party
  • Congress Party
  • PM Modi
  • telangana

తాజావార్తలు

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions