Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఒకప్పుడు ‘బుట్టబొమ్మ’గా భారీ క్రేజ్ సంపాదించిన పూజా హెగ్డేకు ఇప్పుడు వరుస పరాజయాలు సవాల్‌గా మారాయి. తెలుగులో ‘అల వైకుంఠపురములో’, తమిళంలో ‘బీస్ట్’ సినిమాల తర్వాత ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. బాలీవుడ్‌లోనూ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ‘హౌస్‌ఫుల్ 4’ మినహా ఆమె నటించిన హిందీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ టాలీవుడ్లో బుట్టబొమ్మగా వచ్చిన క్రేజ్‌తో కొంతకాలం పాటు అవకాశాలు అందుకుంది. అయితే వరుస ఫ్లాపుల నేపథ్యంలో ఆ క్రేజ్ ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇటీవల ‘కూలీ’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో సందడి చేసిన పూజా హెగ్డే.. ‘రెట్రో’, ‘జన నాయగన్’ వంటి సినిమాల్లోనూ కనిపించింది. మరోవైపు ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’లో గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ విజయాలు మాత్రం ఆమెకు దూరంగానే ఉంటున్నాయి. వరుస పరాజయాల ప్రభావం పూజా కెరీర్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న సినిమాల సంఖ్య కూడా పరిమితమే. తమిళంలో ‘కాంచన 4’, తెలుగులో ‘శ్రీశ్రీ’ సినిమాలు ఆమె లైనప్‌లో ఉన్నాయి. అయితే ఈ చిత్రాల విడుదల తేదీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Also Read
- Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
ఇక అహాన్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘సంకీ’ సినిమాకు పూజా హెగ్డే 2024లోనే సైన్ చేసింది. ఈ చిత్రం 2025 ప్రేమికుల రోజున విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. అక్టోబర్ 30 నుంచి తిరిగి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూజా ఆశలన్నీ ఈ సినిమాలపైనే ఉన్నాయి. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధిస్తే ఆమెకు మళ్లీ వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్లో తన పాత క్రేజ్‌ను తిరిగి సంపాదించుకోవాలంటే ఒక బలమైన హిట్ అవసరం. మరి పూజా ఈ సినిమాలతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తుందా?.. తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టుకుంటుందా? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!