Site icon NTV Telugu

PM Modi: కాల్పుల విరమణపై ట్రంప్ జోక్యం ఉందా..? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన మోడీ

Pm Modi1

Pm Modi1

రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని తాజాగా పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై మోడీ సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఆపమని ప్రపంచలోని ఏ నాయకుడు మమ్మల్ని అడగలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. “మే 9న నాతో మాట్లాడేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రయత్నించారు. ఆయన మూడు-నాలుగు సార్లు ఫోన్ చేశారు. ఆ సమయంలో నేను ఒక సమావేశంలో బిజీగా ఉన్నాను. నేను తిరిగి ఫోన్ చేశాను. పాకిస్థాన్ చాలా పెద్ద దాడి చేయబోతోందని ఆయన తెలిపారు. ఒక వేళ పాకిస్థాన్ దాడికి యత్నిస్తే.. వారికి చాలా నష్టం వాటిల్లుతుంది. పాక్ ఎలాంటి దాడి చేసినా చూసుకుంటామని చెప్పాను.. పాకిస్థాన్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని వాన్స్‌కు వివరించాను..” అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

READ MORE: PM Modi: ఇకపై “అణు బ్లాక్‌మెయిలింగ్”కు భయపడము.. శత్రదేశాలకు మోడీ వార్నింగ్

ప్రతిపక్షం, కాంగ్రెస్ పై ప్రధాని మోడీ తీవ్రంగా దాడి చేశారు. పాక్ అజెండాను ఇంపోర్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు… పాకిస్థాన్‌పై చేసిన దాడుల ఫొటోలను కాంగ్రెస్ అడుగుతోందని తెలిపారు. “ఉగ్రవాదుల మాస్టర్లు ఏడుస్తున్నట్టు చూసి ఇక్కడి నేతలు కొందరు ఏడుస్తున్నారు. కాంగ్రెస్‌ను చూసి దేశం మొత్తం నవ్వుతోందన్నారు. సైన్యం పట్ల కాంగ్రెస్ వైఖరి మొదటి నుంచి ప్రతికూలంగా ఉందని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎప్పుడూ కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోలేదని అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డోక్లాం సమయంలో విదేశాల నుంచి నిశ్శబ్దంగా బ్రీఫింగ్‌లు ఎవరు తీసుకుంటున్నారు? అనిప్రశ్న లేవనెత్తారు. కాంగ్రెస్ తరచుగా పాకిస్థాన్ వర్సెన్‌ను వినిపించిందని, పాకిస్థాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని మోడీ ఆరోపించారు. మన దగ్గర ఆధారాలు లేకపోతే కాంగ్రెస్ ఇంకా ఏం చేసి ఉండేదో అన్నారు.

Exit mobile version