Target Ambani: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్థానీయులతో జరిగిన బ్లాక్-టై కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యక్ష అణు బెదిరింపునకు పాల్పడ్డారు. భవిష్యత్తులో భారతదేశంతో యుద్ధం జరిగితే తమ దేశం “సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది” అని పేర్కొన్నారు. అనంతరం ఆయన భారత బిలియనీర్ ముఖేష్ అంబానీని ప్రత్యేకంగా ప్రస్తావించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తదుపరి తాము ఏమి చేస్తామో చూపించడానికి,…
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని తాజాగా పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై మోడీ సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఆపమని ప్రపంచలోని ఏ నాయకుడు మమ్మల్ని అడగలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. "మే 9న నాతో మాట్లాడేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రయత్నించారు.
ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభకు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ వర్షాకాల సమావేశాలు భారత్ విజయ్ ఉత్సవానికి నిదర్శనమన్నారు.. ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా విజయ్ ఉత్సవ్.. విజయ్ ఉత్సవ్‌ను దేశం మొత్తం జరుపుకుంటోందని వెల్లడించారు.