రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని తాజాగా పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై మోడీ సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఆపమని ప్రపంచలోని ఏ నాయకుడు మమ్మల్ని అడగలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. "మే 9న నాతో మాట్లాడేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రయత్నించారు.