గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. అయితే న్యూమోనియాతో బాధపడుతున్నా సిరివెన్నెల ఈ నెల 24న చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే సిరివెన్నెల మరణం పట్ల సినీ ప్రముఖులు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. మోడీ తన ట్విట్టర్ లో ”అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి ” అని పోస్ట్ చేసారు.
అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి . pic.twitter.com/qxUBkJtkYU
— Narendra Modi (@narendramodi) November 30, 2021