PM Modi : మన్‌కీ బాత్‌లో తెలంగాణ ప్రస్తావన.. సిరిసిల్ల నేతన్నపై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన యెల్ది హరి ప్రసాద్ అనే చేనేత కార్మికుడు జీ20 పేరుతో వస్త్రాన్ని తయారు చేసి మన్‌కీ బాత్కు పంపడంతో ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ రూపొందించిన వస్త్రాన్ని చూపించడం, హరి ప్రసాద్ పేరు ప్రస్తావించడంతో స్థానికంగా అభినందనలు మిన్నంటాయి. పలువురు బీజేపీ నాయకులు హరి ప్రసాద్‌ను సన్మానించారు. అయితే నేడు ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ మిత్రులారా! నేటి కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన బహుమతి గురించిన చర్చతో ప్రారంభించాలనుకుంటున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నేత సోదరుడు ఉన్నారు. ఆయన పేరు యెల్ది హరిప్రసాద్ గారు. ఆయన తన స్వహస్తాలతో నేసిన ఈ జి-20 లోగోను నాకు పంపారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. హరిప్రసాద్ గారు తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో నైపుణ్యం ఉంది. చేతితో నేసిన G-20 లోగోతో పాటు హరిప్రసాద్ గారు నాకు ఒక లేఖ కూడా పంపారు. వచ్చే ఏడాది జి-20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని ఇందులో రాశారు.
Also Read : Pig Hotel: నేను ఎప్పుడూ చూడలే.. పందులకోసం ఫైవ్ స్టార్ హోటలా?
దేశం సాధించిన ఈ విజయం నుండి పొందిన ఆనందంతో ఆయన తన స్వహస్తాలతో జి-20 లోగోను సిద్ధం చేశారు. తన తండ్రి నుండి ఈ అద్భుతమైన నేత ప్రతిభను వారసత్వంగా పొందిన ఆయన ఈ రోజు పూర్తి ఇష్టంతో అందులో నిమగ్నమై ఉన్నారు. మిత్రులారా! కొన్ని రోజుల క్రితం నేను జి-20 లోగోను, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను ఆవిష్కరించే అవకాశాన్ని పొందాను. ఈ లోగోను పోటీ ద్వారా ఎంపిక చేశారు. హరిప్రసాద్ గారు పంపిన ఈ బహుమతి అందుకోగానే నా మనసులో మరో ఆలోచన వచ్చింది. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జి-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో ఎంతగా అనుసంధానమయ్యాడో చూసి నేను చాలా సంతోషించాను.
Also Read
ఇంత పెద్ద సమ్మిట్‌ని దేశం నిర్వహించడం వల్ల హృదయం ఉప్పొంగిపోయిందని హరిప్రసాద్ గారి లాంటి చాలా మంది నాకు లేఖలు పంపారు. పూణే నుండి చిల్లరా సుబ్బారావు గారు, కోల్‌కతా నుండి తుషార్ జగ్మోహన్ గారు పంపిన సందేశాలను కూడా నేను ప్రస్తావిస్తాను. జి-20 మొదలుకుని భారతదేశం చేపట్టిన అనేక క్రియాశీలక ప్రయత్నాలను వారు ఎంతో ప్రశంసించారు.’ అంటూ మన్‌కీ బాత్‌లో ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే.. దీనిపై తాజాగా యెల్ది హరి ప్రసాద్ మాట్లాడుతూ.. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తన పేరు ప్రస్తావించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జీ-20 సమావేశంలో మోదీ అధ్యక్షుత వహించిడం చూసి గర్వంగా అనింపించి జీ20 పేరుతో వస్త్రాన్ని తయారు చేసి మన్‌కీ బాత్కు పంపానని హరిప్రసాద్ వివరించారు. ప్రధాని మోడీ చేనేత కార్మికుల గొప్పదనాన్ని కళా నైపుణ్యం గురించి చెబుతూ నా పేరు ప్రస్తావించడం ఆనందంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?