కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం 14 లక్షల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించింది. దేశ ప్రజలను ఎందుకు అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం పెరుగుతున్నట్లు తెలిపారు. ఆర్థిక లోటును పూడ్చేందుకు సెక్యూర్టీలను జారీ చేసి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సుమారు 14. 13 లక్షల కోట్ల రూపాయల రుణం తీసుకోనున్నట్లు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు అని ప్రియాంక గాంధీ ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా వెల్లడించారు.
Read Also: Delhi Police: విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ మధ్య గొడవపై ఢిల్లీ పోలీసులు చేసిన పోస్ట్ వైరల్..
అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 14 లక్షల కోట్లు అప్పు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది.. ఎందు కోసం ఆ డబ్బు తీసుకుంటున్నారు అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఇక, స్వంతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు దేశం చేసిన అప్పు 55 లక్షల కోట్లు మాత్రమే అయితే.. గడిచిన పదేళ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రుణాన్ని 205 లక్షల కోట్లకు చేర్చిందని ప్రియాంక గాంధీ ఆరోపణలు గుప్పించారు. అంటే మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సుమారు 150 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినట్లు వెల్లడించింది. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి మీద 1.5 లక్షల అప్పు ఉందని ప్రియాంక తెలియజేసింది.
वित्त मंत्रालय का कहना है कि भारत सरकार मौजूदा वित्त वर्ष में 14 लाख करोड़ से अधिक का कर्ज लेने जा रही है।
क्यों?
आजादी के बाद से वर्ष 2014 तक, 67 सालों में देश पर कुल कर्ज 55 लाख करोड़ था।
पिछले 10 वर्ष में अकेले मोदी जी ने इसे बढ़ाकर 205 लाख करोड़ पहुंचा दिया।
इनकी सरकार…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 30, 2024