18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో 91 ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్‌లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు."రేడియో, ఎఫ్ఎం విషయానికి వస్తే, దానితో నాకు ఉన్న సంబంధం ఉద్వేగభరితమైన శ్రోతతో పాటు హోస్ట్‌గా ఉంటుంది" అని ప్రధాన మంత్రి అన్నారు.
Today (05-01-23) Business Headlines: డార్విన్ బాక్స్‌కి రూ.40.5 కోట్లు: మానవ వనరుల సేవలు అందించే హైదరాబాద్ స్టార్టప్ డార్విన్ బాక్స్ తాజాగా దాదాపు 40 కోట్ల రూపాయలకు పైగా నిధులను సమీకరించింది. సిరీస్ డీ ఫండ్ రైజ్‌లో భాగంగా వీటిని సేకరించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఫండ్స్‌ను సమకూర్చింది. ఏడేళ్ల కిందట స్థాపించిన డార్విన్ బాక్స్ ఇటీవలే యూనికార్న్ హోదా పొందిన సంగతి తెలిసిందే.
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి గురించి ప్రసార మాధ్యమాల్లో వచ్చే కార్యక్రమాలకు, ప్రత్యక్ష ప్రసారాలకు ఎంతో ప్రాధాన్యత వుంటుంది. అయితే శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పేలా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం చేస్తూన్న సుప్రభాత సేవ కైంకర్యాల ప్రత్యక్షప్రసారాలను ఎందుకు నిలిపివేసారు అని నిలదీశారు బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఏడాది ముందుగానే అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలన్నారు. ఆల్ ఇండియా రేడియా యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న శ్రీవారి భక్తులు స్వామివారి పూజా…