PM Modi: ఎన్డీఏ కూటమి ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశం.. గెలుపు సూత్రాలు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. విపక్ష పార్టీ ఎన్డీఏకు వ్యతిరేకంగా భారత కూటమిని ఏర్పాటు చేసింది. 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు.. ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఇందులో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ప్రధాని మోడీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ పార్టీల ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీలతో సమావేశంలో భాగంగా ప్రధాని మోడీ.. తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, దక్షిణాది రాష్ట్రాలు, బీహార్, ఒడిశా, జార్ఖండ్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఐదు కీలక సూత్రాలను పాటించాల్సిందిగా ప్రధాని ఎంపీలకు సూచించారు. ఈ సూత్రాలను ఎట్టిపరిస్థితుల్లో ఎంపీలు పాటించాల్సిందేనని.. అలాగైతేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఆదేశాలు జారీ చేశారు.
Tamannaah Bhatia: పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్.. విజయ్ వర్మ పరిస్థితేంటో?
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
అయోధ్యలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరాన్ని.. వచ్చే సంవత్సరం 2024 జనవరిలో ప్రారంభించనున్నారు. అయితే ఈ మందిరం పేరు చెప్పి ఓట్లు అడగొద్దని.. ఉత్తరప్రదేశ్ ఎన్డీఏ ఎంపీలకు సూచించారు. రామ మందిరం పేరు చెప్తే ఓట్లు రావన్నారు ప్రధాని మోడీ. అంతేకాకుండా.. ఆర్టికల్ 370 రద్దు ప్రస్తావన కూడా తీసుకురావద్దని ఎంపీలకు సూచించారు. చేసిన అభివృద్ధి గురించి మాత్రమే వివరించి.. ఓట్లు రాబట్టుకోవాలని ప్రధాని తెలిపారు.
Pawan Kalyan: రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా..?
ఇండియాగా పేరు మార్పు చేసుకున్న విపక్ష కూటమికి.. ప్రధాని మోడీ ఘమండియా అనే పేరు పెట్టారు. అదే పేరుతో ఎంపీలంతా పిలువాలని భావిస్తున్నట్లు ప్రధాని మోడీకి తెలియజేశారు. మరోవైపు మహారాష్ట్ర సదన్ లోని ఎంపీలను ఉద్దేశిస్తూ.. పేదల కోసం పనిచేయాలని ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. అంతేకాకుండా గరిబీ సబ్లే బడి జాతీ హై (పేదరికం అతిపెద్ద కులం) అని ఎంపీలకు తెలియజేశారు. యూపీ, బీహార్ లలో కులం అంశం అతి సున్నితమైన అంశమని.. ఆయా రాష్ట్రాల ఎంపీలు కులాల కంటే పేదరికానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి.. ఓట్లు అడగాలన్నారు. పేదలు సద్వినియోగం చేసుకున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు సంపాదించాలన్నారు.
Sangareddy: కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె..
అంతేకాకుండా అధికారపక్ష సభ్యులు అనవసర వివాదాల జోలికి వెళ్లొద్దని ప్రధాని సూచించారు. వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రతిపక్షాల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాయని.. అందుకోసం రెచ్చిపోయి మాట్లాడకూడదని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు ప్రతి మాటా అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలని… ఎలాంటి ట్రాప్‌లో పడొద్దని ఎంపీలను ఆదేశించారు. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ ఎంపీలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ప్రధాని మోడీ సూచించారు. ప్రతీ నియోజకవర్గంలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తూర్పు యూపీ ఎంపీలను ఆదేశించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!