కువైట్ అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు సహా మొత్తం 50 మంది ప్రాణాలు కోల్పోయారు. పదులకొద్ది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పొగ పీల్చి అక్కడిJక్కడే మెట్లపై ప్రాణాలు కోల్పోయారు.
రాంచీలోని మహమ్మద్ అలీ హుస్సేన్ కువైట్‌లోని భవనం అగ్నిప్రమాదంలో మరణించారనే వార్త తెలిసిన తర్వాత అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన 24 ఏళ్ల అలీ.. తన తల్లి కువైట్ కు వెళ్లొద్దని చెప్పినప్పటికీ, మెరుగైన జీవితం కోసం 18 రోజుల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అయితే.. గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అలీ మృతి చెందాడు.
కువైట్ అగ్నిప్రమాదంలో 50 మంది విదేశీ కార్మికులను బలి తీసుకున్న కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులతు అరెస్ట్ చేశారు. గత బుధవారం జరిగిన ప్రమాదంలో 50 మంది భారతీయులు, ఫిలిప్పీన్స్ ప్రాణాలు కోల్పోయారు.
కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలు కేరళకు చేరుకున్నాయి. బుధవారం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 45 మంది భారతీయులే ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడు, ఖండవల్లి గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తులు బుధవారం కువైట్ దేశంలో బహుళ అంతస్థ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందారు.
Kuwait Fire: కువైట్‌లోని మంగాఫ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయ కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలతో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం C-130J శుక్రవారం ఉదయం గల్ఫ్ దేశం నుండి కొచ్చికి బయలుదేరింది.
కువైట్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఆప్తుల్ని కోల్పోయిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనాస్థలిలోనే కార్మికులు ఖాళీ బుడిదైపోయారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షల సాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధి నుంచి అందజేస్తారు.
కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయుల మృతుల సంఖ్య 49కి చేరింది. బుధవారం తెల్లవారుజామున 10 అంతస్తుల బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సంఘటనాస్థలిలో 40 మంది భారతీయులు సజీవదహనం కాగా.. మరో 9 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
కువైట్‌లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం ఇండియా నుంచి తమది కాని దేశం వెళ్లిన కార్మికులు.. నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ ఘోర విషాదం కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో చోటుచేసుకుంది.