తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపుతోంది. ఈనెల 7న టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ ఈ చోరీకి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో విధులు ముగించుకుని బయటకు వచ్చే సమయంలో పరకామణిలో ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ రూ.20వేలు నగదు చోరీ చేసినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు…