A Biker Beats Prankster Who Tries To Scare Him: దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే సంగతిని పక్కన పెట్టేస్తే.. రాత్రివేళ ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, ఎవ్వరైనా పరుగు లంకిస్తారు. మరీ ముఖ్యంగా.. ఒంటరిగా వెళ్తున్నప్పుడు తెల్ల దుస్తుల్లో ఎవరైనా కనిపిస్తే, దెయ్యమని భావించి అక్కడి నుంచి పారిపోతారు. సూపర్‌మ్యాన్ కన్నా వేగంగా అదృశ్యమవుతారు. కానీ.. ఒక వ్యక్తి మాత్రం అలా చేయలేదు. అందుకు భిన్నంగా ఊహించని పని చేశాడు. తనని భయపెట్టించడానికి ప్రయత్నించిన ఆ దెయ్యాన్ని రివర్స్‌లో చితకబాదాడు. అయితే.. అది రియల్ దెయ్యం కాదులెండి, ప్రాంక్ వీడియో కోసం రెడీ అయిన ఫేక్ దెయ్యం. ఆ వివరాల్లోకి వెళ్తే..
Mother Agony: కొడుకు కోసం తల్లి ఆరాటం.. మృత్యువుతో పోరాడుతున్న కన్నబిడ్డ
అతడు ఒక యూట్యూబర్. ప్రాంక్ వీడియోలు ఎక్కువగా చేస్తుంటాడు. రాత్రివేళ ఎక్కువ అలజడి లేని ప్రాంతాల్లో.. దెయ్యం రూపంలో మనుషుల్ని భయపెట్టిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతగాడు ఓ నడిరోడ్డుపై.. వాహనాల్లో వచ్చి, పోయేవాళ్లని తెల్ల దుస్తులు ధరించి భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఓ బైకర్‌ని కూడా భయపెట్టించాలని అనుకున్నాడు. ఇందుకు అతడు నడిరోడ్డు మీద కూర్చున్నాడు. అతని వద్దకు చేరుకున్న బైకర్.. భయంతో పరుగు పెట్టకుండా, దగ్గరగా వచ్చి చూశాడు. అప్పుడు ఆ బైకర్‌పై దెయ్యంలా ఒక్కసారిగా ఎగబడ్డాడు. నాలాంటోడు అయితే, ఆ దెబ్బకు భయపడి బుల్లెట్ ట్రైన్‌లాగా పారిపోతాడు. కానీ, ఆ బైకర్ మాత్రం భయపడలేదు. రివర్స్‌లో అతనికి కోపం వచ్చింది. ఇంకేముంది.. నన్నే భయపెడతావా? అంటూ ఆ దెయ్యాన్ని చితక్కొట్టడం మొదలుపెట్టాడు.
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఇది నాల్గవసారి అంటూ సీరియస్
‘ఒరేయ్ బాబు ఇది ప్రాంక్‌రా నాయనా, నన్ను విడిచిపెట్టు’ అని చెప్పినా ఆ బైకర్ వినలేదు. వెంటపడి మరీ దుమ్ముదులిపేశాడు. ఇంతలో వీడియో చిత్రీకరిస్తున్న ఆ ప్రాంక్‌స్టర్ స్నేహితులు వచ్చి, ఆ బైకర్‌ని అడ్డుకోబోయాడు. ఇదేమైనా బొమ్మలాటగా ఉందా? అంటూ వాళ్ల మీద కూడా ఎటాక్ చేశాడు. చివరికి వాళ్లు సారీ చెప్పడంతో, ఆ బైకర్ శాంతించి వాళ్లని క్షమించేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేం.. ఆ ప్రాంక్‌స్టర్ కోరినట్టు ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతోంది.
https://twitter.com/Fun_Viral_Vids/status/1626581354443063299?s=20